Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

సఫారీల టార్గెట్ 275

Rohit-Sharma-Cricketer

పోర్ట్ ఎలిజబెత్: వేదికగా సెయింట్ జార్జ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టు ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక పోర్ట్ ఎలిజబెత్‌ మైదానంలో భారత్‌కు ఇది ఆరో మ్యాచ్ కాగా.. 200కిపైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. అంతేగాక సఫారీ గడ్డ మీద వరుసగా విఫలమ వుతోన్న ఓపెనర్ రోహిత్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు శుభపరిణామం. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ఇది రోహిత్‌కు వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీ కాగా, సఫారీలపై రెండోది. మిగతా బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ(36), ధావన్(34), శ్రేయాస్ అయ్యర్(30) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగిసాని ఎంగిడి 4, రబడాకు ఒక వికెట్ తీశారు.

Comments

comments