Search
Thursday 24 May 2018
  • :
  • :

రాష్ట్రంలో 52 రైలు వంతెనలు

ph01

రైల్వేతో కలిసి ఉమ్మడి వ్యయం ప్రాతిపదికన ఈ ఏడాది నిర్మాణం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించేందుకు ఈ ఏడా ది దాదాపు రూ.2700 కోట్లతో 52 రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఒబి)లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించనున్నట్లు వెల్లడించింది. మొత్తం 460 ఆర్‌ఒబిలను దశల వారీగా నిర్మించాలని రైల్వేశాఖ చేసిన ప్రతిపాదనలలో 52 ఆర్‌ఒబి నిర్మాణ ప్రతిపాదనలను పరస్పరం ఆమోదించినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఒబి, ఆర్‌యుబి నిర్మాణాలపై రాష్ట్ర మంత్రి హారీశ్‌రావు అధ్యక్షతన జలసౌధలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రవాణా శాఖమంత్రి పి. మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సిఆర్) జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్‌తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడు తూ ఆర్‌ఒబి, ఆర్‌యుబిల నిర్మాణాలకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైల్వే శాఖ, రోడ్లు, భవనాల శాఖల సమన్వయంతో నిర్మాణాలు త్వరగా చేపట్టేందుకు మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రంలో 4 లైన్ల రోడ్ల నిర్మాణా లు పెద్దఎత్తున చేపడుతున్నందున 4 లైన్ల ఆర్‌ఒబిల నిర్మాణానికి- రైల్వే శాఖను ఒప్పించినట్లు మంత్రి తెలిపారు. పాత ఆర్‌ఒబిలకు, ట్రాఫిక్ రద్దీ ఉన్న ఆర్‌ఒబిల పునరుద్ధరణకు నిధులు సమకూర్చాలని రైల్వే జిఎంను కోరామన్నారు. రైల్వే శాఖ ప్రతిపాదించిన మేరకు ఆర్‌ఒబిలు నిర్మాణాలను పూర్తిగా రాష్ట్ర పరిధిలోని రహదారులు, భవనాల శాఖ చేపట్టనున్నట్లు తుమ్మల చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 16 ఆర్‌ఒబిల స్థితిగతులపై మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రులు సంబంధిత జిల్లా కలెక్టర్లను కోరారు. మెదక్ అక్కంపల్లి రైల్వే లైన్ నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి అవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Comments

comments