Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఫ్లోరిడాలో కాల్పులు :17మంది మృతి

florida-fire-atack

పార్క్‌ల్యాండ్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ప్లోరిడా పార్క్ ల్యాండ్ లోని మర్జోరీ స్టోన్ మన్ డగ్లస్ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని అదే స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్ క్రూజ్ (19) గా పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

comments