Search
Thursday 24 May 2018
  • :
  • :

ఒమన్‌తో 8 ఒప్పందాలు

mdi

మస్కట్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ఒమన్‌తో ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ఒమన్ రాజు ఖబూస్, మోడీ ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. మోడీ మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఒమన్ వెళ్లారు. రాజు ఖబూస్‌తో విస్తృత చర్చల్లో పాల్గొన్న అనంతరం పలు ఒప్పందాలకు అంగీకారం తెలిపారు. దుబాయ్ నుంచి ఆదివారం ఒమన్‌కు చేరుకున్న మోడీ ఉన్నత స్థాయి అధికారులు, రాజుతో చర్చలు జరిపారు. ఇరువురు నేతలు వ్యాపారం, పెట్టుబడులు, ఇంధన వనరులు, రక్షణ, భద్రత, ఆహార భద్రతతో పాటు పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఒమన్ అభివృద్ధికి దోహదపడుతున్న నిజాయతీపరులైన, కష్టించి పనిచేస్తున్న భారతీయుల కృషిని సుల్తాన్ ఖబూస్ అభినందించారు. ఇరు వర్గాల మధ్య చర్చల అనంతరం 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే ప్రజా, వాణి జ్య సంబంధ విష యాల్లో న్యాయ, చట్టపరమైన అంశా ల్లో పరస్పర సహకారానికి ఎంఓయులను కుదుర్చుకున్నారు. దౌత్యాధికారులు, ప్రముఖుల పాస్‌పోర్టుల విషయంలో వీసా మినహాయింపులకు సంబంధించిన అం శంపైనా అంగీకారానికి వచ్చారు. ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో సహకారంపై ఎంఓయుపై సంతకం చేశారు. మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ స్పోరట్స్ కాంప్లెక్స్‌లో మోడీ ప్రవాసులతో సమావేశమై ప్రసంగించారు. ఇరు దేశాల రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నా భారత్, ఒమన్‌ల మధ్య బలమైన సంబంధాలు కొనసాగు తూనే ఉన్నాయని మోడీ వెల్లడించారు.ఈ సంబంధాలను పటిష్టం చేయడంలో ప్రవాసులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గల్ఫ్‌లో దాదాపు 9 మిలియన్లకు పైగా భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రధాని మోడీ ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ అసద్ బిన్ తారిఖ్‌తో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య అంతర్గత సంబంధాలు, పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం మోడీ ఒమన్‌కు చెందిన సిఇఓలతో ఏర్పాటు చేసిన భారత్- ఒమన్ బిజినెస్ సమావేశానికి హాజరయ్యారు.
మస్కట్ పురాతన శివాలయంలో మోడీ పూజలు
ప్రధాని మోడీ మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి. ఒమన్ సుల్తాన్ ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుజరాత్‌కు చెందిన వ్యాపా ర వర్గాలు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆలయ దర్శనానంతరం సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించేందుకు మోడీ వెళ్లారు.

Comments

comments