Search
Thursday 24 May 2018
  • :
  • :

ట్రాక్టర్- బైక్ ఢీ: వ్యక్తి మృతి

accidnt1
కూసుమంచి: మండలంలోని జెక్కేపల్లి  గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాధంలో గ్రామానికి చెందిన కొదమగుండ్ల కుమార్ (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన చెరుకు లోడుతో ఉన్న ట్రాక్టర్ బైక్‌ను ఢీ కొట్టడంతో కుమార్ మృతిచెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు  పరిహారం ఇవ్వాలని కోరగా జాప్యం చేయడంతో ఆగ్రహించిన మృతుని బందువులు జెక్కేపల్లి గ్రామంలో రోడ్డుపై ఉదయం గం. 11.00ల నుండి సాయంత్రం గం. 5.00ల వరకు పెద్ద ఎత్తున దళితులందరూ ఆంధోళన చేయడంతో కూసుమంచి సిఐ వసంతకుమార్, ఎస్సైపి. రఘు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులు, ట్రాక్టర్ యజమాని ఇరుపక్షాలతో మాట్లాడి ఆంధోళనను విరమింపజేశారు. ఈ ప్రమాధ సంఘటనపై కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

comments