Search
Thursday 24 May 2018
  • :
  • :

విమాన ఇంజిన్ల తయారీ కేంద్రం

ktr

టాటా గ్రూపు, జిఇ ఏవియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు ఆదిభట్లలో ఏర్పాటు
భూమిపూజ చేసిన మంత్రి కెటి రామారావు

హైదరాబాద్ : టాటా గ్రూపు, జిఇ ఏవియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటు చేస్తున్న ఏరో ఇంజిన్ల తయారీ కేంద్రానికి మంత్రి కెటిఆర్ సోమవారం నాడు భూమి పూజ చేశా రు. టిఎస్‌ఐఐసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డితో పాటు, టాటా సన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రెసిడెంట్ బాన్మాలీ అగర్వాల, జిఇ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సిఇఒ విశాల్ వాన్చూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిఇ ఏవియేషన్, టాటా గ్రూప్ ఆధ్వర్యంలో హెచ్‌ఐసిసిలో జరిగిన సమావేశానికి మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతలు, తయారీ విధానాలను ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం అందిస్తున్నందుకు జిఇ, టాటా సంస్థలను కెటిఆర్ అభినందించారు. ఏరో ఇంజిన్ల తయారీలో టాటా అగ్రస్థానంలో ఉంద ని, టాటాకు జిఇ కూడా తోడవడంతో సామర్థం మరింత పెరిగిందన్నారు. ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో విమాన విడి భాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఇంత పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నందుకు టాటా, జిఇ కంపెనీలకు ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ అకాడమి, నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా జిఈ నుండి అత్యాధునిక సాంకేతికతలను జోడించి ఏరో ఇంజిన్ విడి భాగాలను జెట్ , సిఎఫ్‌ఎం లీప్ ఇంజన్ కోసం తయారు చేయనున్నారు. జిఈ ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య 2017లో జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటు కానుంది.
ఎయిర్‌క్రాఫ్ట్ విడి భాగాల తయారీ, అసెంబ్లింగ్, వివిధ విభాగాల పనితీరును నిర్వహించడం వంటికి ఈ కేంద్రం ద్వారా చేయనున్నారు. అనంతరం జిఈ సౌత్ అధ్యక్షుడు విశాల్ వాన్చూ మాట్లాడుతూ ఈ రెండు కంపెనీల మధ్యన భాగస్వామ్యం ద్వారా భారతీయ విమానయాన, రక్షణ రంగ పరిశ్రమ కోసం తమ సహకారం అందించనున్నామన్నారు.

Comments

comments