Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

మార్చి 24నాటికి ఓటర్ తుదిజాబితా సిద్ధం చేయాలి

pic

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : జిల్లాలోని పట్టణ ప్రాంతాలు మినహా, అన్నిపోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ నెల 16, 17వ తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణలు చేసేందుకు ప్ర జలకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్ట ర్, జిల్లా ఎన్నికల అధికారి మాణిక్కరాజ్ కణ్ణన్ ఒక  ప్రకటనలో తెలిపారు. మార్చి 24, 2018 నాటికి ప్రచురించబోయే తుది ఓట ర్ల జాబితాకు మునుపే పోలింగ్ స్టేషన్ల వా రిగా ఓటర్లకు సంబంధించిన వివరాలను సవరించడం జరుగుతుందన్నారు. స్థానిక బూత్‌లెవల్ అధికారులు క్లెయిమ్స్‌కు సం బంధించిన ఫారాలను సేకరించి పోలింగ్ స్టేష న్ వారిగా ఓటర్ల జాబితాను తయారు చేస్తారన్నారు. భవిష్యత్తులో ఓటర్ల జాబితాకు సం బంధించి ఎటువంటి పొరపాట్లు దొర్లకుం డా ఆ జాబితాపై సంబంధిత వార్డు మెం బర్ లేదా సర్పంచ్ సంతకం విధిగా తీసుకుంటారన్నారు. ఈ పూర్తిప్రక్రియ మండలా ల్లో సంబంధిత మండల అధికారి, పంచాయతిరాజ్ ఈవోఆర్డి పర్యవేక్షణ అధికారులుగా ఉండి పర్యవేక్షిస్తారన్నారు. ఎంపిడివోలు, పంచాయతీరాజ్ ఈఓఆర్డీలు పోలింగ్ స్టేషన్ వారిగా ఫారం-6 క్లెయిమ్‌లను, బిఎల్‌వో తయారు చేసిన కన్‌సాలిడేటెడ్ లిస్టు ను, ఓటర్ల జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను సేకరించి ఈ నెల 19వ తేదిలోపు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలన్నారు. ఈ ప్రక్రియకు అవసరమైన ఫారాలను ఆయా మండల తహాశీల్దార్లకు వెంటనే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 15వ తేదిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై స్పెషల్ డ్రైవ్ ఆవశ్యకతను ఆయా మండల తహాశీల్దార్లు తెలియజేస్తారన్నా రు. ఓటర్ల జాబితాను శుద్దికరించడం కోసం జిల్లాలో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా ఆయా రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు నమోదు చేసుకోవడానికి, మార్పులు, చేర్పులు, చనిపోయిన, మిస్సింగ్ నేమ్స్ తదితర సవరణలు స్పెషల్ డ్రెవ్‌లో చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

Comments

comments