Search
Friday 25 May 2018
  • :
  • :

ఏప్రిల్ 26న భరత్ అనే నేను

Mahesh

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి డి.పార్వతి సమర్పణలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ “ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీని తర్వాత పూనేలో షెడ్యూల్ ఉంటుంది. మార్చి 27 వరకు మొత్తం సినిమాకు సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం. మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌కు ఇది ఓ ప్రతిష్టాత్మక చిత్రమవుతుంది”అని అన్నారు. మహేష్, కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లు ప్రముఖ తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీః రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు, పాటలుః రామజోగయ్యశాస్త్రి, ఎడిటింగ్‌ః శ్రీకర్‌ప్రసాద్.

Comments

comments