Search
Friday 25 May 2018
  • :
  • :

కెసిఆర్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి మండిపాటు

Kishan-Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు తన పనితీరుపై దృష్టిసారిస్తే మంచిదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తికావస్తున్నా రైతులకు పూర్తిగా రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు నాలుగేళ్లుగా పిఆర్‌సి బకాయిలు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాటికి వినియోగిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అనే దశకు వస్తుందనుకుంటే అదో దండగగా మారుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

Comments

comments