Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

మాట మారుస్తున్న చంద్రబాబు : సోము వీర్రాజు

SOMU

విజయవాడ : ఎపికి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని చెప్పిన సిఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు మాటమారుస్తున్నారని బిజెపి ఎంఎల్‌సి సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కేంద్ర నిధుల విషయంలో టిడిపి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఈ అసత్య ప్రచారాలకు తెరదించుతామని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎందుకు విభజన బిల్లులో చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చలేదని, కేవలం పరిశీలిస్తామని మాత్రమే బిల్లులో పేర్కొన్నారని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా కేంద్ర సంస్థలను ఎపిలో నెలకొల్పామని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై కూడా చంద్రబాబు మాటమారుస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం అన్ని ఇచ్చిందని, తాము చాలా సంతృప్తిగా ఉన్నామని గతంలో చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారని ఆయన అన్నారు. అన్నీ ఇస్తున్న కేంద్రాన్ని ఇంతకంటే ఏమీ అడగలేమని నాడు సుజనా చౌదరి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరు నూరైనా ఎపికి కేంద్రం హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంపై ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానాలని ఆయన టిడిపి నేతలకు సూచించారు.

BJP MLC Somu Veerraju Comments on Chandrababu

Comments

comments