Search
Thursday 24 May 2018
  • :
  • :

షిప్‌యార్డులో పేలుడు : ఐదుగురు మృతి

SHIP-YARD

కేరళ : కొచ్చి షిప్‌యార్డులో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు ఘటనాస్థలిలో చిక్కుకున్నారు. మొబైల్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ యూనిట్‌లో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. దేశంలోనే ఓడల తయారీ, మరమ్మతులకు కొచ్చి షిప్‌యార్డు ప్రధాన కేంద్రం అన్న విషయం తెలిసిదే. దేశానికి చెందిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ ఐఎస్‌ఎస్ విక్రాంత్ ఇక్కడే తయారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Blast Inside Cochin Shipyard : 5 Died

Comments

comments