Search
Thursday 24 May 2018
  • :
  • :

దద్దరిల్లిన ఎఒబి!

ind

సీలేరు ప్రాంతంలో ఉభయ రాష్ట్రాల పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు
ప్లీనరీ సమాచారం తెలిసి కూంబింగ్
ఎదురెదురు కావడంతో తుపాకుల మోత
తప్పించుకున్న ఆర్‌కె?
54 కిట్ బ్యాగులు, ల్యాండ్‌మైన్స్, తుపాకులు స్వాధీనం

హైదరాబాద్: ఆంధ్రఒడిశా సరిహద్దులో మరోసారి తుపాకుల మోత మోగిం ది. జోడుంబా, సీలేరు ప్రాంతంలో రెండు రాష్ట్రాల పోలీసులు, మావోయిస్టులు పరస్పరం బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా విస్తృత కూంబింగ్ ప్రారంభించారు. జోడుంబా, సీలేరు కటాఫ్ ప్రాంతంలో ఎదురుపడ్డ రెండు వర్గాలు పరస్పర ఎదురు కాల్పులకు దిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అక్క డి నుంచి మావోయిస్టులు తృటిలో తప్పించుకున్న ట్లు సమాచారం. సుమారు 70 మందికిపైగా మావోయిస్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నట్లు తెలిసిం ది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు పార్టీ కీలకనేత ఆర్‌కె కూడా ఉన్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి 54 మావోయిస్టుల కిట్ బ్యాగులను స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. ల్యాండ్‌మైన్స్, తుపాకులు, ఇతర సామాగ్రి కూడా లభ్యమయ్యా యన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపులు జరుపుతున్నామని, అదనపు బలగాలను కూడా రప్పించినట్లు తెలిపారు. సరిగ్గా 16 నెలల క్రితం (అక్టోబర్ 24, 2016) ఇదే ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకున్నా ఆయన కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మాత్రం మృతిచెందాడు. పోలీసుల కాల్పుల్లో ఆర్కే తప్పించుకోవడం ఇది మూడోసారి

Comments

comments