Search
Thursday 24 May 2018
  • :
  • :

మహేశ్ తర్వాత అంతటి అందగాడు నాగశౌర్య

naga

ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో శంకర్ ప్రసాద్, ఉషా నిర్మాతలుగా నాగశౌర్య, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు వెంకీ మాట్లాడుతూ “నాగశౌర్య నాకు మా అమ్మానాన్న తర్వాత అంత ముఖ్యమైన వ్యక్తి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు. నన్ను నమ్మి సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి దర్శకుడిని చేశాడు. ఈ సినిమా కోసం ఐరా క్రియేషన్స్ నిర్మాతలు నాకు ఏం కావాలంటే అది ఇచ్చి ప్రోత్సహించారు” అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి ఘన విజయాన్ని అందించిన వెంకీ చాలా మంచి దర్శకుడు అవుతాడు. కొరటాల శివ అంతటి పెద్ద డైరెక్టర్ అవుతాడు. సినిమాలో హీరోయిన్ రష్మిక చాలా బాగా చేసింది. ఆమెను గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. బాహుబలి సినిమా చేసిన చంటి ఎడిటింగ్‌తో పాటు వ్యక్తిగతంగా చాలా సహాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ సినిమాను అందంగా రూపొందించారు”అని చెప్పారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ “బెస్ట్ పేరెంట్స్ అవార్డును ఈ చిత్ర నిర్మాతలు శంకర్, ఉషకు ఇవ్వాలి. కుటుంబం అంతా కలిసి శౌర్యకు మంచి హిట్ ఇచ్చారు. మహేష్ తర్వాత అంతటి అందగాడు నాగశౌర్య. ఈ విషయం మా అమ్మగారు చెప్పారు. వెంకీ కథ చెప్పిన రోజునే  సినిమా హిట్ అవుతుందని చెప్పాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ ప్రసాద్, ఉషా, రష్మిక మండన్న, భాస్కరభట్లతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments