Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

పిపిఎఫ్ ఖాతాల్లో మార్పులు!

BNSS

న్యూఢిల్లీ : పిపిఎఫ్(పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)కు సంబంధించిన ఆర్థిక బిల్లు 2018లో మార్పులు ప్రతిపాదించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆదాయం పన్నుతో పాటు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాడిట్లు(ఎఫ్‌డి)ల పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లను ఈ చిన్న మొత్తాల పథకం పిపిఎఫ్ అందిస్తుంది. అయితే ప్రజావసరాలకు అనుగుణంగా చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్లలోపే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను మూసివేసే అవకాశం కల్పించనుంది. పిపిఎఫ్ నుంచి అత్యవసర వైద్యానికి, ఉన్నత విద్య కోసం డబ్బు తీసుకునే వెసులుబాటు, మైనర్ల పేరిట ఖాతాలు తెరిచి పొదుపు చేసే అవకాశాన్ని ఇవ్వనుంది. ఖాతాదారుల ఇబ్బందులు తెలుసుకోవడానికి, సమస్యల పరిష్కారానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. కొత్త చట్టం తీసుకురావడం ద్వారా చిన్నమొత్తాల పొదుపు పథకాల నిబంధనలు, నియమావళిని డిపాజిట్‌దారులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలు, జాతీయ పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలన్నీ చిన్నమొత్తాల పొదుపు పథకాలుగా పరిగణిస్తారు.

Comments

comments