Search
Thursday 24 May 2018
  • :
  • :

లెక్కింపు కొనసాగుతోంది..

rbi

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్(నోట్ల రద్దు) చేపట్టి ఇప్పటికి 15 నెలలు కావొస్తోంది. అయినప్పటికీ ఇంకా పాత రూ.500, రూ.1000 నోట్లు నాణ్యత, వాటి లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ పనులను వేగంతం చేశామని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. రద్దయిన నోట్లు మొత్తం ఎన్ని వచ్చాయో తెలియజేయాల్సిందిగా ఆర్‌టిఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా ఓ పిటిషన్‌దారుడు కోరగా ఆర్‌బిఐ ఈవిధంగా స్పందించింది. బ్యాంకుల నుంచి వచ్చిన రద్దయిన నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉందని ఆర్‌బిఐ వెల్లడించింది. 2017 జూన్ 30 వరకు రూ.15.28 ట్రిలియన్ రద్దయిన నోట్లు వచ్చాయి. ఎప్పటి లోగా నోట్ల లెక్కింపు పూర్తవుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆర్‌బిఐ నిరాకరించింది. మొత్తం 59 సివిపిఎస్(అధునాతన కరెన్సీ పరిశీలన ప్రక్రియ) యంత్రాలతో నోట్లు లెక్కిస్తున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది. ఏ ప్రాంతాల్లో నోట్ల లెక్కింపు జరుగుందనే విషయాన్ని మాత్రం చెప్పేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఎనిమిది సివిపిఎస్ యంత్రాలతో బ్యాంకుల్లో నోట్ల లెక్కింపు జరుగుతుండగా, ఏడు సివిపిఎస్ యంత్రాలతో ఆర్‌బిఐ రీజనల్ కార్యాలయాల్లో నోట్ల లెక్కింపు జరుగుతోంది. 2016, నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను మోడీ సర్కారు రద్దు చేసింది. 2016-17 వార్షిక నివేదిక ప్రకారం రూ.15.28లక్షల కోట్ల రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చి చేరాయి. నోట్ల రద్దు చేసే సమయానికి 1,716.5 కోట్ల రూ.500 నోట్లు, అలాగే 685.8 కోట్ల వెయ్యి నోట్లు చెలామణీలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉంది

Comments

comments