Search
Thursday 24 May 2018
  • :
  • :

వీడిన పింకి హత్య మిస్టరీ

SANDEEP

హైదరాబాద్ : గర్భిణి పింకి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ హత్యకు దారి తీసిన కారణాలను సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య మీడియాకు తెలిపారు. గర్భిణి పింకిని చంపి, ఆపై ముక్కలుముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి బొటానికల్ గార్డెన్ సమీపంలో పారేశారని సిపి వెల్లడించారు. మృతురాలు పింకి బిహార్‌కు చెందిన మహిళ అని ఆయన చెప్పారు. పింకికి దినేష్ అనే వ్యక్తితో 15ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, పింకి దంపతులు 2017లో విడిపోయారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పింకి వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నారు. బతుకుదెరువు కోసం వికాస్ హైదరాబాద్‌కు వచ్చాడు. వికాస్‌ను వెతుక్కుంటూ పింకి కూడా హైదరాబాద్‌కు వచ్చింది. వికాస్ అంతకుముందే మమత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ప్రియుడు వికాస్‌తో పింకి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో మమత పింకిని హత్య చేయించిందని సందీప్ శాండిల్య పేర్కొన్నారు.

CP Sandeep Shandilya Comments on Pinky Murder

Comments

comments