Search
Thursday 24 May 2018
  • :
  • :

అకాల వర్షంతో జొన్న, మొక్కజొన్న పంటలకు నష్టం

crp

నిజామాబాద్: సోమవారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నం పేట, బాల్కొండ, మెండోరా, ఏర్గట్ల, ముప్కాల్, నవీపేట, మాక్లూర్ మండలాల్లోని రైతన్నలను నిండా ముంచివేసింది. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో మండలంలో సాగువుతున్న ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తూ కురిసిన వర్షందాటికి మొక్కజొన్న పంట పూర్తిగా విరిగిపోయి నేలవాలింది. అలాగే ఎర్రజొన్న పంటసైతం గాలుల దాటికి త ట్టుకోలేక కంకి విరిగి పంట నేలకొరిగింది. కళ్ళాల్లో ఆరబెట్టిన పసుపు వర్షంలో తడిసి ముద్దయింది. పలుచోట్ల పిందె దశలో ఉన్న మామిడి కాయలతో పాటు పూతరాలిపోయి మామిడి రైతులను దెబ్బతీసింది. మంగళవారం ఉదయం ఆర్మూర్ ఏడిఏ రామారావ్ నాయక్ ,మండల వ్యవసాయ అదికారి మండలంలోని వెల్మల్ గ్రామంలో దెబ్బతిన్న పం టలను పరిశీలించారు. దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళి రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు తమ గోడును అదికారుల వద్ద వెళ్ళబోసుకున్నారు. తమను ఆదుకోవాలని అదికారులను వేడుకున్నా రు. మండలంలో జరిగిన పలు పంటల నష్టం వివరాలను సేకరించి వాటి వివరాలను ఉన్నతాదికారులకు నివేదిస్తానని ఏడిఏ రామారావ్ నాయక్ రైతులకు బరోసా ఇచ్చారు.
ఆకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు
ఆర్మూర్ రూరల్‌లో…
ఆర్మూర్ మండల పరిధిలోని గ్రామలైన మిర్దాపల్లి, ఆలూర్, గోవింద్ పేట్, మచ్చర్ల గ్రామాలలో సోమవారం రాత్రి ఆకా లంగా కురిసిన వర్షాలకు పంటలు చాలా వరకు దెబ్బతి న్నాయి. మొక్కజొన్న, జొన్న, పసుపు పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షం కారణంగా పంటలను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన వర్షానికి పంటల నష్టాలను అంచన వేయాడానికి ఉన్నత అధికారు లు రైతులకు సంబంధించిన పంట భూములలో పర్యటన చేసి నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపుతామని రైతలకు హామీ ఇచ్చారు. పంట నష్ట వివరాలు 67 హేక్టార్లలో మొక్క జొన్న, 1005 హేక్టార్లలో ఎర్రజొన్న, 10 హేక్టార్లలో కూర గాయల పంటలు పంట నష్టం సంభవించిందని ఈ వివ రాలను జిల్లా ఉన్నత అధికారులకు ప్రాథమిక నివేదికను సమర్పించి రైతులకు నష్ట పరిహారం అందజేస్తామాని ఉప వ్యవసాయధికారి రామారావు నాయక్, మండల వ్యవసా యధికారి గోపి రైతులకు తెలిపారు. ఈ పర్యటనలో ఆలూ ర్ సర్పంచ్ కళాశ్రీ ప్రసాద్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ వి.ఆర్. ఓ, వి.ఆర్.ఎ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్‌లో…
మాక్లూర్ మండలంలో అకాల వర్షానికి ఈదురు గాలులకు వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వులు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత ఖరీఫ్‌లో దోమకాటుకు తీవ్రంగా నష్ట పోయిన రైతులకు గోరుచుట్టుపై రోకటిపోటులా త యారయింది. సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన ఈదురు గాలులకు మండలంలో సుమారు రెండు వేల ఒక వంద ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మండలంలోని బొంకన్‌పల్లి, గొటుముక్ల, గంగరమంద, డీకంపల్లి, వెంకటాపూర్, వల్ల భాపూర్, లకా్ష్మపూర్, గుంజిలి, చికిలి, కొత్తపల్లి, ధర్మోరా, మాందాపూర్, ముల్లంగి(బి) తదితర గ్రామాలలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. అధికారుల లెక్కల ప్ర కారం 395 ఎకరాల్లో జొన్న, 763 ఎకరాల్లో మొక్కజొన్న, 173 ఎకరాల్లో నువ్వులు, 748 ఎకరాల్లో వరి పంట వడగళ వాన, ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి. ప్రభు త్వం వెంటనె రైతులకు నష్ట పరిహారం అందించాలని కోరు తున్నారు.
ఏర్గట్లలో…
సోమవారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలను వ్యవసాయ అధికారులు అబ్దుల్ మాలిక్, సాయి సచిన్ లు పరిశీలించారు. అనం తరం మాట్లాడుతూ… మండలం పరిధి బట్టాపూర్ గ్రామం తో పాటు పలు గ్రామాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఓ మోస్తరు పాటు వర్షం పడినప్పటికి ఈదురుగాలుల వల్ల మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలు నెలకొరిగాయని అన్నా రు. కొంతమంది రైతులకు సంబందించి మొక్కజొన్న, ఎర్ర జొన్న పంటలు పూర్తిగా నెలవలడంతో పంట నష్టం వా టిల్లిందని అన్నారు. సుమారుగా వేసిన అంచనాల ప్రకారం 50 ఎకరాల్లో ఎర్రజొన్న, 120 ఎకరాల్లో మొక్కజొన్న పం టలు బాగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. పరిశీలన అ నంతరం జిల్లా అధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రైతులు ఉన్నారు.

Comments

comments