Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఏడుపాయలకు మూడున్నర కోట్లు : డిప్యూటీ స్పీకర్

PADMA-DEVENDER-REDDY

మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెసి నగేశ్, ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. ఏడుపాయల అభివృద్ధికి రూ. 3.50 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ జాతర కోసం రూ. 1.50 కోట్లు విడుదల చేసినట్టు స్పీకర్ గుర్తు చేశారు.

Comments

comments