Search
Friday 25 May 2018
  • :
  • :

పశుగ్రాసం కొరత రావొద్దు

cc3*రాష్ట్ర పశుసంవర్ధక, మత్స శాఖ మంత్రి
తలసాని శ్రీనివాస యాదవ్

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కింద గొల్ల, కురమ్మలకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 8వేల 4వందల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు రాష్ట్ర పశు సంవర్ధక,మత్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాదు నుంచి గొర్రెల పంపిణీ, చేపల పెంపకంపై జిల్లా క లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్ష ల 76వేల 4 వందల జీవాలను పంపిణీ చేశామన్నారు. ఇ ందు కోసం 2,600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జిల్లాలోని సంచార పశువైద్య అంబులెన్స్‌ల పని తీరును పర్యవేక్షించాలని తెలిపారు. రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. స్టైల్ పశుగ్రా సంపెంపకాన్ని విరివిగా ప్రోత్సాహించాలని తెలిపారు. 75 శాతం సబ్సిడీతో అందిస్తున్న పశుగ్రాసం పెంపకం పై రైతులకు అవగాహన కల్పించి సొంతంగా భూమి ఉన్న రైతుల కు పశుగ్రాసంపెంచుకునే విధంగా ప్రోత్సాహించాలని తెలిపారు. అదేవిధంగా ఇరిగేషన్, హార్టికల్చర్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. వేసవిలో పశుగ్రాసం నీ టి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న గొర్రెలకు షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చేపల మార్కెట్లు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలన్నారు.
శాఖలచే చేపట ఔట్ లెట్స్ ఏర్పాటుపై ప్రణాళికలు రూ పొందించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేనా, జా యింట్ కలెక్టర్ బద్రీ శ్రీనివాస్, పిషరీస్ జాయింట్ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments