Search
Thursday 24 May 2018
  • :
  • :

సమగ్ర నేర సర్వే వద్దు

highcourt

హైకోర్టు ఆదేశం
ఉత్తర్వుల అమలు
నిలిపివేశామని తెలియజేసిన రాష్ట్రం

 హైదరాబాద్ : సకల నేరస్థుల సమగ్ర సర్వేపై హైకోర్టులో రాష్ట్ర పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ సర్వేను సవాలు చేస్తూ ఇటీవల దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరువురి తరఫు న వాదనలు విని నేరస్థుల సమగ్ర సర్వేపై అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డిని వివరణ కోరింది. ఇకనుంచి ఈ సర్వే చేయబోమని హైకోర్టుకు ఆయన మెమో ద్వారా స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు సర్వే ద్వా రా సేకరించిన వివరాలపై ఎలాంటి నిర్ణ యం తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. సేకరించిన డేటాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని హైకోర్టుకు వివరించారు. నేరస్థుల డేటా తప్పుదారి పడితే ఎవరైనా తమను ఆశ్రయించవచ్చని హైకోర్టు వెల్లడించింది. కాగా ఇప్పటికే రాష్ట్ర పోలీసులు లక్షకుపైగా నేరస్థుల వివరాలను సమగ్ర సర్వేలో సేకరించారు.

Comments

comments