Search
Thursday 24 May 2018
  • :
  • :

చంద్రబాబుపై 3.. కెసిఆర్‌పై 2

KCR-chandra-babu

న్యూఢిల్లీ: రాష్ట్రాల సిఎంల ఆస్తులు, వారిపై ఉన్న కేసుల వివరాలను ఎడిఆర్(అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏ రాష్ట్ర సిఎంపై ఎన్ని కేసులున్నాయనే విషయాలను సవివరంగా తెలిపింది. క్రిమినల్ కేసులు ఉన్నవారిలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనపై ఏకంగా 22 కేసులుండగా, వీటిలో మూడు క్రిమినల్ కేసులు కావడం గమనార్హం. 11 కేసులతో రెండో స్థానంలో కేరళ సిఎం పినరాయి విజయన్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ సిఎం అరవింద్ క్రేజీవాల్‌పై 10 కేసులున్నాయి. పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్‌తో పాటు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌పై చెరో నాలుగు కేసులుండటం గమనార్హం. జమ్మూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, బిహార్ సిఎం నితీష్ కుమార్‌పై ఒక కేసు చొప్పున ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల సిఎంల విషయానికి వస్తే… తెలంగాణ సిఎం కెసిఆర్‌పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Comments

comments