Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

రోడ్డెక్కుతున్న కంది, ఎర్రజొన్న రైతులు

prtst

మద్దతు ధరలు రాక రైతన్నల ఆందోళన
మౌనం పాటిసున్న ఎంఎల్‌ఎలు

నిజామాబాద్: కందుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తూకం చేయకుండా నిర్లక్షం ప్రదర్శిస్తున్నారని, అనేక వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్డెక్కుతున్నారు. మద్దతు ధర అందక సతమతమవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం కష్టపడి పండించిన తమ పంటలకు సరైన ధర రాక నష్టపోతున్నామని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, కేంద్రం కందుల సేకరణకు ససేమీరా అనడంతో సహకార సంఘాల్లో కొనుగోలు ఆపేశారని హాకా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ, రైతుల వద్ద ఉన్న పూర్తి పంటను కొనుగోలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనీస మద్దతు ధర అందక, మరికొన్ని కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు స్తంభించడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఏడాది కందిపంట కొరతతో పప్పుల ధరలు ఇబ్బడి, ముబ్బడిగా పెరిగాయి. ఆ సమయంలో మధ్య దళారులు, వ్యాపారులు రైతుల అంచనా ప్రకారం ధర చెల్లించి కొనుగోలు చేసారు. కానీ ఏడాది కంది పంట ఆశించిన దానికంటే రెట్టింపు ఉత్పత్తి కావడంతో ఆశించిన మద్దతు ధర రాక రైతు లు రోడ్డెక్కుతున్నారు. కేంద్రం ప్రతి క్వింటాలుకు మద్దతు ధర మిగతా 2లో..

Comments

comments