Search
Friday 25 May 2018
  • :
  • :

ఎస్‌ఆర్‌ఎస్‌పి సాగునీరును అందించటమే ప్రభుత్వ లక్ష్యం

knr1

సుల్తానాబాద్: ఎస్‌ఆర్‌ఎస్పి డి-86, డి83 ఆయకట్టు చివరి పంట పొలాల వరకు సాగునీరును అందిచంటమే ప్రభుత్వ లక్షం అని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అల్లంరాజు దేవసేన అన్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నీరుకుల్ల రోడ్డులో ఎస్‌ఆర్‌ఎస్పి బిర్జి వద్ద నీటి సరఫరా తాకిడితో ప్రమాద కరంగా కావాటంతో తాత్కలిక మరమత్తు పనులను, సాగునీటి సరఫరా తీరును కలెక్టర్ అల్లంరాజు దేవసేన మంగళవారం  సాయంత్రం పరిశీలించారు. అలాగే పూసాల శివారులోని రాజీవ్ రహదారి వద్ద ఎస్‌ఆర్‌ఎసి నీటి సరఫరాను కూడా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్పి ఆయకట్టు కాలువలకు సాగునీటిని ఈ రోజు ఉదయం విడుదల చేయటం జరిగిందని అన్నారు. గత వారం కూడా చివరి అయకట్టు పంటలకు సాగునీరు చేరుకుందన్నారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావుల సహకారంతో నీటిని ఎక్కువ సరఫరా చేయటం జరుగుతుందని అన్నారు.  ఈ విడత కూడా చివరి అయకట్టు పంటలకు నీటి సరఫరాను అందించేందుకు రెవెన్యూ సిబ్బంది, ఎస్‌ఆర్‌ఎస్పి, పోలీస్ శాఖ సిబ్బంది పక డ్బందీగా పని చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. రెండు కాలువలకుగాను 1800క్యూసెట్ల సాగునీరును అందించేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని వాస్తవానికి ఎస్‌ఆర్‌ఎస్పి ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకోని రైతులు వేసిన పంటలకు సాగునీరును అందించడం జరుగుతుందని అన్నారు. ఓదేల, శ్రీరాంపూర్ మండలాలకు సాగునీరును అందిస్తున్నామని అన్నారు. నీటిని పోదుపుగా వాడుకోవాలని ఆయకట్టు రైతులను కలెక్టర్ కోరారు. డి-83కాలువకు కమాన్‌పూర్ ప్రాంతంలో కొంత నీరు తగ్గిందని అన్నారు. గతం వారం కంటే ఇప్పుడు నీటి సరఫరాను పెంచటం జరిగిందని అన్నారు. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనర్‌ల సహకారంతో పోలీస్ సిబ్బంది సేవలను వినియోగించడం జరుగుతుందన్నారు. జగిత్యాల, మేట్‌పల్లి ప్రాంతంలో విద్యుత్ మోటర్లను రైతులు అధికంగా కాలువ నిటిని వినియోగించుకోవటంతో నీటి సరఫరా తగ్గుతున్నదని అన్నారు. మన జిల్లా కాదుకదా అన్నారు. 1600క్యూసెట్ల నిరుసరఫరా జరిగిన సరిపోతుంది కాని పూర్తి స్ధాయిలో నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని ఇందుకు రైతులు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని జిల్లా కలెక్టర్ అల్లంరాజు దేవసేన అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ తహసీల్దార్ అంబటి రజిత, ఎస్‌ఆర్‌ఎస్పి డిఇ నాగభూషనం, ఆర్‌ఐ రవిందర్, ఈఆర్‌ఓ రాంరెడ్డి, నీరుకుల్ల సర్పంచ్ బోయిని రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments