Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

‘స్వచ్ఛ సర్వేక్షణ్’ గిన్నిస్ రికార్డు

 ktr2

రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ

 మూడు నిమిషాల పాటు రోడ్లను ఊడ్చిన 15,320 మంది విద్యార్థులు

 స్వచ్ఛ భారత్ కంటే ముందే స్వచ్ఛ హైదరాబాద్‌కు సిఎం కెసిఆర్ శ్రీకారం : మంత్రి కెటిఆర్

ముషీరాబాద్: హైదరాబాద్ నగరంలోని రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ సర్వే క్షణ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్‌లో సోమవారం ఉదయం వీఎస్టీ చౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ మీదుగా సుందరయ్యపార్కు వరకూ 15 వేల 320 మంది విద్యార్థులతో పాటు కార్మికులు, ఉద్యోగులు, బస్తీవాసులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మూడు నిమిషాల పాటు రోడ్లను ఊడ్చి గిన్నీస్ రికార్డును నమోదుతో పాటు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, యూనివర్శిల్ బుక్ ఆఫ్ రికార్డ్ రెండు సాధించారు. గతేడాది గుజరాత్‌లోని వడోదర మున్సిపాలిటీలో 5,058 మందితో రోడ్లు ఊడ్చి గిన్నీస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.  రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గుజరాత్ వడోదర రికార్డును బద్దలు కొట్టింది. రాంనగర్‌లోని 32 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర పురపాలక, ఐటి మంత్రి కె.టి.రామారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.  అనంతరం అంబేద్కర్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ స్వచ్ఛ త విషయంలో హైదరాబాద్ మహా నగరాన్ని జాతీయ స్థా యిలో అగ్రస్థానంలో ఉంచుదామన్నారు. ప్రజల సహకా రం ఉంటే ఏదైనా సార్థకమవుతుందన్నారు. 2017లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భారత్ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం దక్కిందని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ ప్రారంభం కంటే ముందే సీఎం కేసిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శక్తి హైదరాబాద్ స్వచ్ఛత కోసం ఉపయోగపడాలని, అందరూ సహకరించాలని కోరారు.  జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ ఢిల్లీ నుంచి వచ్చే బృందం అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు. 1969 నెంబర్‌కు మిస్ కాల్ చేస్తే, అరగంటలోపు వచ్చే ఫోన్‌లో ఆరు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి, హైదరాబాద్‌ను నెంబర్ వన్‌గా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరోరా కాలేజీ నుంచి సుమారు 4 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి లక్ష్మిరెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వీడియోలు, ఫొటోలను పరిశీలించారు. సినీ నటుడు శ్రీధర్‌రావుతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

comments