Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

భారీ పారితోషికం తీసుకుంటున్న భామలు

ps

ఈమధ్య టాలీవుడ్‌లో హిట్, ఫ్లాపులకు సంబంధం లేకుండా కొందరు అందాల భామలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కొందరు ముద్దుగుమ్మల పారితోషికం ఒక్క హిట్‌తోనే భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం హాట్‌బ్యూటీ పూజా హెగ్డే ఇదేవిధంగా భారీ పారితోషికం తీసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రం ‘ఒక లైలా కోసం’ ఫ్లాప్ అయింది. దాంతో పూజ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు జోడీగా ‘మొహంజోదారో’ సినిమా చేసింది. ఆ చిత్రం కూడా ఫెయిల్ కావడంతో తిరిగి ఈ భామ టాలీవుడ్‌కు వచ్చింది. అల్లుఅర్జున్‌కు జంటగా పూజాహెగ్డే ‘డీజె… దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం చేసి సూపర్‌హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ డాల్ పాత్రలో నటించి మురిపించింది. ఆతర్వాత టాలీవుడ్‌లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దీంతో తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచేసింది. ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటిస్తున్న ‘సాక్షం’ సినిమా కోసం ఆమె కోటిన్నర రూపాయలను పారితోషికంగా తీసుకుందట. ఇక తెలుగులో తన తొలి చిత్రం ‘ఫిదా’ తో ప్రేక్షకులను మైమరపించిన అందాల తార సాయి పల్లవి. ఆతర్వాత ఆమె నానీకి జోడీగా చేసిన ‘ఎంసిఎ’ చిత్రం కూడా సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ భామ కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకుంటోం ది. ఇక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో కణం చిత్రంలో నాగశౌర్యకు జంటగా ఓ సినిమా చేస్తోంది. విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అదేవిధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది.

Comments

comments