Search
Friday 25 May 2018
  • :
  • :

నల్గొండ ఎంపిగా పోటీ చేస్తా : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

komatireddy-venkat-reddy

నల్గొండ : వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపిగా తాను పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నల్గొండ ఎంఎల్‌ఎగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బిసి అభ్యర్థికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవడానికే తాను ఎంపిగా పోటీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మికి ఎంఎల్‌ఎగా పోటీ చేయాలనే ఆలోచన లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎంపిగా గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన గుత్తాకు గత ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీ వచ్చిందని, ఈసారి కాంగ్రెస్‌కు అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డికి డిపాజిట్ కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

I contest as Nalgonda MP in Next Elections : Komati Reddy

Comments

comments