Search
Thursday 24 May 2018
  • :
  • :

గబ్బర్‌కు బైబై.. రబాడకు ఫైన్

Rabada-Vs-Dhawan

పోర్టు ఎలిజబెత్: వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఐదో వన్డేలో సఫారీ బౌలర్ రబాడాకు జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో రబాడ చేసిన అతికి ఐసిసి కోరడా ఝులిపించింది. భారత ఓపెనర్ ధావన్ అవుటైనా తరువాత క్రీజు వదులుతుండగా రబడా పెవిలియన్ వైపు చూపుతూ గబ్బర్‌కు టాటా, బైబై చెప్పడమే దీనికి కారణం. అసలేం జరిగిందంటే… ఎనిమిదో ఓవర్లో రబాడ వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న శిఖర్ 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెలుక్వాయోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ధావన్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో రబాడ టాటా, బైబై అంటూ వీడ్కోలు పలికాడు. అయితే, ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అవుటై వెనుదిరుగుతున్నప్పడు వెటకారంగా సంజ్ఞలు చేయడం ఐసిసి నిబంధనలకు విరుద్ధం. ఇది గమనించిన ఐసిసి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి రబాడ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత వేసింది. అంతేగాక ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా రబాడ ఖాతాలో వేసింది.

Comments

comments