Search
Thursday 24 May 2018
  • :
  • :

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసిపి ఎంపిల రాజీనామా

JAGAN

నెల్లూరు : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేస్తారని వైసిపి అధినేత జగన్ తేల్చి చెప్పారు. జగన్ ప్రస్తుతం నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కలిగిరి శివారులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. అప్పటికీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేస్తారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు డబుల్ గేములు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. డబుల్ గేమ్ ఆడుతున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

If the special status is not given, the YCP MPs will resign

Comments

comments