Search
Friday 25 May 2018
  • :
  • :

మార్చి మొదటి వారంలో మిషన్ భగీరథ తాగునీరు

meeting2*రాష్ట్ర ఆర్థిక,పౌర సరఫరాల శాఖ
మంత్రి ఈటెల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: వచ్చే మార్చి మొదటి వారంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు మి షన్ భగీరథ బల్క్ వాటర్ అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అ న్నారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరం లో మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ ప్రగతి, భూరికార్టుల శుద్ధీకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స ందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటికి నల్లా ద్వారా త్రాగు నీరు అందించుటకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవే శ పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మిషన్ భగీరథ పథకం పనుల అమలు పై ప్రతి 15 రోజులకొకసారి రాష్ట్ర స్థాయిలో సమిక్షిస్తున్నారని తెలిపా రు. కరీంనగర్ జిల్లాలో జనవరి 31లోగా అన్ని గ్రా మాలకు బల్క్ వాటర్ సరఫరా చేయాలని నిర్ణయించామని అయినను ఇంత వరకు ఎందుకు గ్రామాలకు నీరు సరఫనా చేయుటలేదని మంత్రి ఇంజనీర్ల పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలో ఇంకా 160 కిలోమీటర్ల పైపులైను వే య్యాల్సి ఉందన ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ఎస్‌ఇని అడిగి తెలుసుకున్నారు. పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎక్కువ మంది కూలీలను పెట్టి మిషన్లను ఏర్పాటు చేసి 24 గంటలు పనులు చేయించాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చే యించాలని ఇంజనీర్లను ఆదేశించారు. పైపులైన్లు వే యుటకు తగివన్ని సిద్ధంగా ఉన్నయ్యా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీలు పనులు వేగవంతంగా చేయ్యకుంటే వెంటనే తమకు తెలపాలని సూ చించారు. సంబంధి ఏజెన్సీలతో మాట్లాడి పనులలో వేగం పెంచుటకు తగిన ఆదేశాలు ఇస్తామని లేని ప క్షంలో వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చే స్తామని అన్నారు. మిషన్ భగీరథ పథకంలో నిధుల కు కొరత లేదని బిల్లులు రాగానే వెంటనే పేమెంటు చేస్తున్నామని ప్రభుత్వం తపన తీవ్రతను అర్థం చేసుకోవాలని ఆదేశించారు. ఇక నుండి నియోజకవర్గ స్థాయిలో శాసన సభ్యులు సంబంధిత డిఇలతో ఏజెన్సిలతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకొకసారి జిల్లా కలెక్టర్ మిషన్ భగీరథ పనులను సమీక్షించాలని వారం వారం పనులను పర్యవేక్షించాలని సూచించారు.
మిషన్ భగీరథ పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏజెన్సిలను ఆదేశించా రు. పనుల నిర్మాణల సమయంలో భద్రత చర్యలు తీ సుకోవాలని సూచించారు. ముఖ్యంగా మిషన్ భగీర థ పైపులైన్ల నిర్మాణల పనుల సమయంలో రోడ్ల వెంబడి త్రవ్వునప్పుడు, కరెంటు స్థంబాలు పక్క ను ండి త్రవ్వినప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను, ఏజన్సీలను ఆదేశించారు.
దసరాలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి…
జిల్లాకు మంజూరైన రెండుపడక గదుల ఇండ్ల నిర్మాణాలన్నింటిని వచ్చే దసరా పండుగలోపు పూర్తి చే యాలన రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జిల్లాకు 6,454 మం జూరు కాగా అన్ని ఇండ్లకు మండలాల వారిగా మ ంజూరు ఉత్తర్వులు జారీ అయినాయని మంత్రి తెలిపారు. ఇంత వరకు 6,191 ఇండ్లకు టెండర్లు పూర్తి అయినాయని అన్నారు. మండలాలలో, గ్రామాలలో ఇండ్ల స్థలాలు అప్పగించిన ఇండ్లను వెంటనే పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక గ్రామంలో ఒకే చోట కాకుండా భూమ లభ్యత ప్రకారం కాలనీల వారిగా 5,10ఇండ్లు ఉన్న మంజూరు చేయాలని ఆదేశించారు.
ఇండ్ల స్థలాలకు బురద నేల, బండ ఉన్న నేలను గుర్తించవద్దని సూచించారు. సంబంధిత నియోజకవ వర్గాల శాసన సభ్యులు నెలకు ఒక్కసారి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులను ఇంత వరకు ఇండ్లు లేని నిరుపేలైన అర్హులైన వారినే ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రానిక చుట్టు ప్రక్కాల గ్రామాల లబ్దిదారులు మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలంటే మంజూరు చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు అవసరవైన సిమెంటు, ఐరన్ తక్కువ ధరకు ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.
పట్టాదారుపాసు పుస్తకాల
పంపిణీకి ఏర్పాట్లు చేయాలి…
భూరికార్డుల శుద్ధీకరణలో భాగంగా మార్చి 11న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్‌డివోలను, తహశీల్దార్లను ఆదేశించారు.
పట్టాదారు పాసుపుస్తకాలలో ఏలాంటి తప్పులు లే కుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాలో మా ర్చి 11న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం అందరు శాసనసభ్యులను ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులు చేయాలని గ్రా మస్థాయిలో పండుగ వాతావరణంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో వివిధ పాఠశాలలకు, కాలేజిలకు మంజూరైన ప్రహరీలు, టాయిలెట్ బ్లాక్ ల మరమ్మత్తులు, అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన ఇఇ షషీమియాను ఆదేశించారు. భవన నిర్మాణలకు ఏమైన భూ సమస్య ఉంటే సంబంధిత తహసీల్దారు పరిష్కరించి, హద్దులు నిర్ణయించాలన ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ,జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్మెల్యే బొడిగే శోభ, వొడితెల సతీష్ కుమార్,మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ, మిషన్ భగీరథ ఎస్‌ఇ అమరేంద్ర, ఆర్‌అండ్‌బి ఇఇ రాఘవచారి, ఆర్‌డివోలు రాజగౌడ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments