Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ప్రేమ అమరం.. దీనికి ఇదే నిదర్శనం..!(వీడియో)

Man-marries-his-dead-lover

ప్రేమ ప్రేమనే గెలిపిస్తోంది…

చెన్నై: ప్రేమ అంటే అది.. ప్రేమ అంటే ఇది అంటూ మనం సినిమాళ్లో చూసినప్పడు నిజంగా ప్రేమ అంటే అంతా గొప్పద అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఇంకొంత మంది అయితే ఇంకో అడుగుముందుకేసి ఈ సృష్టిలోనే ప్రేమ గొప్పది అంటూ వాదిస్తుంటారు కూడా. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఘటన చూస్తే నిజంగా ప్రేమ చాలా గొప్పదని అనిపించక మానదు. అదే సమయంలో  ఈ  ప్రేమ కథ అందర్ని కదిలిస్తోంది. ఈ లవ్ స్టోరీలో ప్రేయసి ఓడింది కానీ ప్రేమను మాత్రం గెలిపించింది. ప్రేమికుల రోజుకు సరిగ్గా మూడు రోజుల ముందే జరిగిన ఈ రియల్ స్టోరీ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన అమ్మాయి, అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. ఎలాగైనా పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ ప్రేమజంట తలరాతను మాత్రం దేవుడు మరోలా రాశాడు. వారి కలలు తీరకుండానే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

తానో అబ్బాయిని ప్రేమించానని.. అతడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులతో చెప్పింది. అంతే.. అందరీ పెరెంట్స్ లాగే వారు కూడా అది కుదరదని చెప్పేశారు. దాంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే బలవన్మరణానికి ముందు సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో… తనను క్షమించాలంటూ ప్రియుడిని కోరింది. తనకు ఓ కోరిక మాత్రం మిగిలిపోయిందని… దానిని నెరవేర్చాలని తెలిపింది. ఎలాగూ తన ప్రియుడితో పెళ్లికాలేదు… చనిపోయిన తర్వాతైన అతడితో తాళి కట్టించాలని చెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులు కన్నకూతురు చనిపోయిందనే బాధను దిగమింగి ఆ కుర్రాడిని వెతికి తీసుకొచ్చారు. అతడ్ని ఒప్పించి ఆమె మృతదేహానికి తాళి కట్టించారు. యువకుడు కూడా గొప్ప మనసుతో మరోమాట చెప్పకుండా ప్రాణంలేని ప్రియురాలి మెడలో తాళి బొట్టు కట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Comments

comments