Search
Thursday 24 May 2018
  • :
  • :

సమ్మర్ స్పెషల్‌గా ‘మెహబూబా’

puri

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెహబూబా’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై లావణ్య సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యుఎస్‌లలో 800కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ చాలా పాపులర్ అయిపోయింది. పూరి జగన్నాథ్ కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆకాష్ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః విష్ణుశర్మ, సంగీతంః సందీప్ చౌతా, ఎడిటింగ్‌ః జునైద్ సిద్ధిఖీ, యాక్షన్‌ః  రియల్ సతీష్, ఆర్ట్‌ః జానీ షేక్.

Comments

comments