Search
Thursday 24 May 2018
  • :
  • :

భారత్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు

ph4

 మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు
సిరిసిల్ల: భారతదేశ యువత తమపై తాము నమ్మకాన్ని పెంచుకోవాలని, విశ్వాసం పెరిగితేనే ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం సిరిసిల్ల మండలం రగుడులోని రంగినేని ట్రస్ట్‌లో నిర్వహించిన రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సురక్షితమైన దేశంగా భారత్‌ను ఎంచుకుని ముందుకు వస్తున్నాయని వివరించారు. పె ట్టుబడులు రావడానికి రాజకీయ నాయకత్వం కారణం కాదని, ఇక్కడి ప్రజలు శ్రమశక్తి కలిగిన వారని, దేశ చరిత్రను గమనించి వస్తున్నారని వివరించారు. 300 సంవత్సరాలకు పూర్వం మనదేశంలోని ఉత్పాదనలు ప్రపంచ దేశాలకు 77 శాతం ఎగుమథయ్యేవని, సగటు అభివృధ్ధి రేటు (జిడిపి) అప్పట్లో 27శాతం ఉండేదని వివరించా రు. ప్రస్తుతం దేశంలో జిడిపి 7 శాతం, 8 శాతం అనేదానిపై అధికార, ప్రతిపక్షపార్టీలు వాగ్యుద్దాలు చేసుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ఎంపి శశీ ధరూర్ ఇటీవల ఇం గ్లాండుకు వెళ్లి పుస్తకాలు బాగా చదివి మనదేశానికి బ్రిటి ష్ వారు చేసిన అన్యాయాన్ని దులిపిపారేశారని, ప్రధాని మోడీ కూడా శశీధరూర్‌ను అభినందించారని వేదికపై నుంచి మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వివరించారు. సెల్ ఫోన్లలో దరిద్రపుగొట్టు కార్యక్రమాలు చూడకుండా శశిధ రూర్‌లాంటి వారు చేసిన మంచి ప్ర సంగాలను చూడాలని, వినాలని పిలుపునిచ్చారు. ప్రధానిగా పివి నర్సింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృతవిధానాలవల్లే దేశం అభివృధ్ధి చెందుతోందని గుర్తించాలన్నారు. అందుకే యువత తమపై తాము నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అ ధ్యక్షురాలు తుల ఉమ, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సా మల పావని, ఎస్‌పి విశ్వజిత్, ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, పాల్గొన్నారు.

Comments

comments