Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సాయం చేయాలి

KTR

హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో బుధవారం జరిగిన మైనింగ్ టుడే సదస్సులో ఐటిశాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి టిఆర్‌ఎస్ సర్కార్ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. తెలంగాణలో గ్రానైట్ గనులున్నాయన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ శాండ్ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. కొత్త ఇసుక విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు ఇసుకను అందిస్తున్నమని మంత్రి అన్నారు. టిఎస్‌ఐపాస్ ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నం. గనుల్లో కార్మికుల రక్షణకు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్  మాట్లాడుతూ… దేశ జిడిపిలోనే మైనింగ్ శాఖాది అగ్రస్థానమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఫిక్కీ కలిసి సదస్సు నిర్వహించుకోవడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

comments