Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

‘ బార్‌లో మందు తాగి చిందులేసిన కోతి ’(వీడియో)

MONKEY

బెంగళూరు : అసలే అది కోతి… ఆపై మందు తాగింది. ఇంకేముందు బార్‌లో చిందులేసింది. దీంతో బార్‌కు వచ్చిన వారు హడలిపోయారు. ఈ ఘటన బెంగళూరులోని దివాకర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ బార్‌కు రోజూ ఓ కోతి వస్తుందట. అక్కడ ఉన్న ఆహార పదార్థాలను ఆరగించేసి వెళ్లిపోయేది. కానీ మంగళవారం రాత్రి బార్‌లో వదిలేసిన గ్లాసుల్లోని మందును తాగింది. మద్యం మత్తులో అక్కడి వారికి చుక్కలు చూపించింది. ఈ కోతిని నియంత్రిచడం ఎవరి వల్ల కాలేదు. కోతి నుంచి తప్పించుకునేందుకు బార్‌కు వచ్చిన వారు తలోదారి పరుగులు పెట్టారు. కోతిని పట్టుకునేందుకు బార్ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు పండ్లు ఎరగా చూపి ఆ కోతిని పట్టుకున్నారు.

Monkey Drink the  Alcohol in Bar

Comments

comments