Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

కలలు అందరూ కంటారు…కానీ!

ap
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సిఎం చంద్రబాబును అభినందిచారు. మంగళవారం ఎపి సచివాలయంలో చంద్రబాబుతో ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. తొలుత రియల్‌టైం గవర్నెన్స్ (ఆర్టిజి) కేంద్రాన్ని పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేసిన అంబానీ.. సిఎం చంద్రబాబును ప్రశంసించారు. ఆర్టిజితో ప్రజలకు అందిస్తున్న సేవలను చంద్రబాబు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. ఆర్టిజిని అన్ని రాష్ట్రాలకు చూపించాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆర్టిజి లేదని, ఎపితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. మూడేళ్ల క్రితం చంద్రబాబు, నేను కలిసినప్పుడు ఆయన తన పాలనపై ఓ విజన్ చెప్పారు. అప్పుడు నేను చూద్దాంలే అని అనుకున్నానని, కానీ ఇక్కడికి వచ్చి చూశాక ఎంతో సంతోషంగా ఉందన్నారు.కలలు అందరూ కంటారని, వాటిని సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారని అంబానీ పేర్కొన్నారు. అనంతరం సిఎం నివాసంలో ఏర్పాటు చేసిన విందు భేటీకి ముఖేశ్ అంబానీ హాజరయ్యారు.

Comments

comments