Search
Thursday 24 May 2018
  • :
  • :

ప్రపంచంలో 12వ సంపన్న నగరం ముంబై

mbi
మొత్తం సంపద రూ.950 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్15 సంపన్న నగరాల్లో ముంబై 12వ స్థానాన్ని దక్కించుకుంది. దేశీయ ఆర్థిక రాజధాని ముంబై మొత్తం సంపద విలువ 950 బిలియన్ డాలర్లు(85,000 కోట్ల డాలర్లు) అని నివేదిక వెల్లడించింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం, మొదటి స్థానంలో న్యూయార్క్ నగరం ఉండగా, ఆస్తుల విలువ 3 ట్రిలియన్లుగా ఉంది. అయితే ముంబై తర్వాత 14వ స్థానంలో ఫ్రాంక్‌ఫర్ట్.. ఆస్తుల విలువ 912 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నగరాల్లో వ్యక్తుల ప్రైవేటు ఆస్తులు మొత్తం సంపదగా పరిగణలోకి తీసుకున్నారు. వాటిలో వారి ఆస్తులు.. నగదు, ఈక్విటీలు, వ్యాపార ప్రయోజనాలు, ఇతరత్రా ఉన్నాయి. ప్రభుత్వ నిధులను ఈ గణాంకాల్లో తీసుకోలేదు. బిలియనీర్ జనాభా కల్గిన టాప్ 10 నగరాల్లో కూడా ముంబై ఉంది. ఈ నగరంలో 28 మంది బిలియనీర్లు ఉండగా, ఒక్కొక్కరికి సుమారు ఒక బిలియన్ డాలర్ల(100 కోట్ల) విలువైన ఆస్తులు ఉన్నాయి. భారత్ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో 950 బిలియన్ డాలర్ల సంపద ఉండగా.. 12వ అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్ బిఎస్‌ఇ(బాంబే స్టాక్ ఎక్సేంజ్)ను కలిగి ఉంది. న్యూయార్క్ తర్వాత రెండో స్థానంలో లండన్ నగరం ఆస్తులు 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న టోక్యో 2.5 ట్రిలియన్ డాలర్లు, సాన్‌ఫ్రాన్సిస్కో 2.3 ట్రిలియన్ డాలర్లు సంపద కల్గి ఉన్నాయి. ఇక బీజింగ్ విషయానికొస్తే 2.2 ట్రిలియన్ల డాలర్లు, షాంఘై 2 ట్రిలియన్ డాలర్లు, లాస్ ఏంజిల్స్ 1.4 ట్రిలియన్ డాలర్లు, హాంకాంగ్ 1.3 ట్రిలియన్ డాలర్లు, సిడ్నీ 1 ట్రిలియన్ డాలర్లు, సింగపూర్ 1 ట్రిలియన్ డాలర్లు, చికాగో 988 బిలియన్ డాలర్లు సంపదను కల్గి ఉన్నాయి. టాప్ 15 నగరాల జాబితాలో సాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, షాంఘై, ముంబై, సిడ్నీలు గత పదేళ్లలో అత్యంత వేగంగా సంపదను పెంచుకున్నాయని నివేదిక వివరించింది.

Comments

comments