Search
Friday 25 May 2018
  • :
  • :

ఒక రోజు ముందుగానే వస్తున్న సూర్య

Surya

అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో అర్జున్, శరత్‌కుమార్‌లు, రావు రమేష్, బొమన్ ఇరాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే ఏప్రిల్ 26న విడుదల చేస్తామని తాజాగా సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక అల్లుఅర్జున్ తండ్రిగా తమిళ్ హీరో అర్జున్ నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇక బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రంలోని రెండవ పాట ‘లవర్ ఆల్సో.. . ఫైటర్ ఆల్సో’ను బుధవారం విడుదల చేయనున్నారు.

Comments

comments