Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం : తమ్మినేని

Tammineni

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసే దిశలో తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నల్గొండలో తమ పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ పార్టీల పరిస్థితి తదితర అంశాలపై ఈ మహాసభల్లో చర్చించామని ఆయన వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కులపై సిఎం కెసిఆర్ నోరు మెదపడం లేదన్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని ఆయన కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. గోల్కొండ కూడలిలో త్వరలోనే బిఎల్‌ఎఫ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

No Alliance With Any Party in Next Elections

Comments

comments