Search
Thursday 24 May 2018
  • :
  • :

టెర్రరిజానికి అంతం లేదా?

sampadakeyam

పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన రెండు టెర్రరిస్టు బృందాలు జమ్మూకశ్మీర్‌లోని రెండు సైనిక స్థావరాలపై మూడ్రోజుల్లో జరిపిన రెండు దాడులను మన సైన్యం విజయవంతంగా తిప్పికొట్టటం సంతోషించాల్సిన విషయం. అయితే అదే సమయంలో ఐదుగురు టెర్రరిస్టులను హతమార్చిన మన సైన్యం ఆర్గురు సైనికులను కోల్పోవటం అత్యంత బాధాకరం. వారితోపాటు ఒక సాధారణ పౌరుడుకూడా మరణించాడు. పాక్ స్థావరం గా పనిచేస్తున్న టెర్రరిస్టు సంస్థ లస్కరే తోయిబా ఈ దాడులకు బాధ్యత స్వీకరించింది. జమ్మూలో, శ్రీనగర్‌లో సాయుధ దళాల స్థావరాల్లోకి టెర్రరిస్టుల చొరబాటు యత్నాలను సకాలంలో పసిగట్టటంవల్ల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం నివారించబడింది. జమ్మూలోని సుంజువాన్ సైనిక శిబిరంలో కుటుంబ క్వార్టర్లపై, శ్రీనగర్‌లో కరణ్‌నగర్ ప్రాంతంలోని సిఆర్‌పిఎఫ్ 23వ బెటాలియన్ క్యాంప్ వద్ద చొరబాటు యత్నాలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితితో, అలాగే రాజకీయ పరిస్థితితో వ్యవహరించటంలో మోడీ ప్రభుత్వంలో ఏదో తెలియని సందిగ్ధావస్థ లేదా లోపం ఉన్నట్లు కనిపిస్తున్నది. ప్రధాని అంతర్జాతీయ వేదికలపై, విదేశీ నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాకిస్థాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తుతున్నారు. టెర్రరిజానికి మతం, ప్రాంతం లేదు, అందరం కలసికట్టుగా పోరాడి అంతం చేద్దాం అని కోరుతున్నారు. అయితే తమకున్న మినహాయింపువల్లనో లేక ఉమ్మడి పోరాటం ఎలాగో తెలియకో విదేశీ నేతలనుండి మాటమాత్రపు సంఘీభావం తప్ప నిర్దిష్ట తోడ్పాటు లభించటం లేదు. భారత ప్రభుత్వాన్ని ఆత్మీయ మిత్రునిగా భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం, టెర్రరిజంపై గట్టి చర్యలు తీసుకోకపోతే సహాయం నిలిపివేస్తామని పాకిస్థాన్‌కు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. టెర్రరిజంపై భద్రతా మండలి తీర్మానాలను పాకిస్థాన్ పాటించటం లేదంటున్న ట్రంప్ తమ వార్షిక బడ్జెట్‌లో పాకిస్థాన్‌కు 286 మిలియన్ డాలర్ల పౌర సహాయాన్ని, 80 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ప్రతిపాదించారు. కేవలం 10 మిలియన్ డాలర్లు కోతపెట్టారు. ఐరాస నిషేధించిన టెర్రరిస్టు సంస్థలను తమ దేశంలో నిషేధించేందుకు నిరాకరిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ శుక్రవారం అధ్యక్ష డిక్రీ జారీ చేసింది. దీంతో 2008లో ముంబైపై టెర్రరిస్టు దాడి వ్యూహకర్త హఫీజ్ సయీద్ టెర్రరిస్టు జాబితాలోకి వచ్చాడు. అతడి సంస్థలు జమాత్ ఉద్ దవా, ఫలహా ఏ ఇన్‌సానియత్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇది వాస్తవంగా జరుగుతుందా లేక పారిస్‌లో జరిగే ఐరాస కమిటీ సమావేశం ఒత్తిడి నుంచి బయటపడటానికి వ్యూహాత్మకమా వేచిచూడాలి.
2016 జనవరి 1న పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడితో మొదలైన సీమాంతర టెర్రరిస్టు దాడులు ఆ తదుపరి మరికొన్ని సైనిక కేంద్రాలపైకి గురిపెట్టబడ్డాయి. జమ్మూ శివారులోని నగ్రోటలో 15 కోర్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి వాటిలో ఒకటి. ఎల్‌ఒసి దాటివెళ్లి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత సైన్యం జరిపిన ‘సర్జికల్ దాడి’ వాస్తవంలో శత్రువుకు చేసిననష్టం కన్నా ఎక్కువగా ప్రచారానికి ఉపయోగపడింది. ఎందుకంటే, ఆ దాడి అనంతరం టెర్రరిస్టుదాడులు, పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగాయి.
ఈ పరిస్థితికి కేంద్రప్రభుత్వంలోని సందిగ్ధావస్థ తప్ప సైనిక వైఫల్యం ఎంతమాత్రం కారణం కాదు.జమ్మూకశ్మీర్ భద్రతా పరిస్థితి మెరుగుపడాలంటే పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించాలని బిజెపి భాగస్వామిగా ఉన్న ప్రభుత్వనేత మహబూబ ముఫ్తి పదేపదే కోరుతున్నారు. కాగా, టెర్రరిజం, చర్చలు పొసగవు అనే వైఖరి మోడీ ప్రభుత్వం తీసుకుంది. ముఫ్తీ అన్నట్లు పాకిస్థాన్‌తో చర్చలు కోరేవారిని జాతి వ్యతిరేకులు గా ముద్రవేసే ప్రమాదం ఉంది. అయితే గత చరిత్రను చూచినపుడు, పాకిస్థాన్‌తో చర్చలు జరుగుతున్న కాలంలో సీమాంతర టెర్రరిస్టు చర్యలు అదుపులో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ వ్యతిరేకతను స్వీయ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా చర్చల
పునఃప్రారంభం గూర్చి ఆలోచిస్తుందని ఆశించుదాం.

Comments

comments