Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

పకోడా ప్రొటెస్ట్…!(వీడియో)

Pakoda-Protest

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ చేసిన పకోడీ వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ టివి ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… ఒక వ్యక్తి పకోడీలు అమ్ముకుంటే ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి రూ. 200 తీసుకెళ్లొచ్చు. దీన్ని ఉపాధి అని ఎందుకు అనుకోకూడదని చెప్పిన విషయం తెలిసిందే.  ఈ వ్యాఖ్యలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ‘నిరుద్యోగంతో బాధపడేకన్న పకోడీలు అమ్ముకోవడం మంచిదేనని, అదేమీ సిగ్గుచేటు పని కాదని’ చెప్పుకొచ్చారు. అయితే, మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలతో విరుచుకుపడింది. ఉద్యోగ భద్రత కల్పించలేని ప్రభుత్వం పకోడీలు అమ్ముకోమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. ఇదొక ఉపాధి అయితే యాచించడాన్ని కూడా ఉపాధిగా పరిగణించవచ్చని సెటైర్లు వేసింది.

కాగా, ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్(ఎన్ఎస్ యు) శనివారం మధ్యప్రదేశ్ లోని శివపురిలో రోడ్డు పక్కన పకోడీలు వేస్తూ అమ్ముకుంటూ… పకోడా ప్రొటెస్ట్ పేరిట వినూత్నంగా నిరసన తెలిపారు.  ఇదే తమ వృత్తి అని కార్యకర్తలు చూరకలంటించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. ప్రస్తుతం ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

comments