Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాల లక్ష్యాలను అధిగమించాలి

coll

*పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
*జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

మన తెలంగాణ/ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న గొల్ల, యాదవ, మత్సకారుల ఆర్థికాభివృద్దిని పెంచేందుకు జిల్లాల్లో కలెక్టర్ల సారధ్యంలో లక్షాలను అధిగమించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పశు సంవర్థక, మత్సశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొల్ల, యాదవ కుటుంబాలకు రాష్ట్రంలో 2,08,489 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, 90 శాతం లక్షాలనుసాధించడం జరిగిందని, 1962 వాహనం ద్వారా పశువులకు, గొర్రెలకు వైద్య సేవలు అందించాలన్నారు. వచ్చే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని మేత సంఘాలు పెంచుకోవాలని, ఇందుకు సీడ్లు సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతులు వారి స్వంత భూముల్లో పెంచుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. గొర్రెలకు భీమా చేయాలని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3 సంతలు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు సంబంధిత తహసీల్దార్ల ద్వారా భూములు గుర్తించాలని అన్నారు. మత్సశాఖ ద్వారా జలాశయాలు, ప్రాజెక్టుల్లో మత్స సంపదను పెంచాలని, మత్సకారుల ఆర్థికాభివృద్ది చేందేలా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి మార్కెట్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించాలన్నారు. జాయింట్ కలెక్టర్లు ప్రతి వారం పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పశువులకు గడ్డి పెంచాలని, మత్స సంపదను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ కలెక్టర్ల సారధ్యంలో గొల్ల, యాదవులకు రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా యూనిట్లను గ్రౌండింగ్ చేసినందుకు అభినందిస్తూ మత్ససంపదకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సువర్ణ, జిల్లా కలెక్టర్ దివ్య, జెసి కృష్ణారెడ్డి, డిఆర్‌డిఓ రాజేశ్వర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, ఉద్యాన శాఖ అధికారి నర్సింగ్ దాస్, ఈడీ రామారావ్, మత్సశాఖ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments