Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వంద సీట్లు : మహమూద్ అలీ

ALI

హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. కెసిఆర్ సుపరిపాలనకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన వారు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీకి చెందిన టిడిపి, ఎంఐఎం పార్టీలకు చెందిన వందలాది మంది మంగళవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మహమూద్ అలీ టిఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మూసి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్‌సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

One hundred seats for TRS in the next election: Mahmood Ali

Comments

comments