Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఒప్పో ఎ71(2018)… ఎఐ టెక్నాలజీతో

Oppo-A71-(2018)

ముంబయి: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త మొబైల్‌ను తీసుకువచ్చింది. ఒప్పో ‘ఎ’ సిరీస్‌లోని ఎ71(2018) 3జిబి ర్యామ్‌తో ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ మొబైల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) బ్యూటీ టెక్నాలజీని కూడా ఉపయోగించడం విశేషం. ఫోన్ ధర వచ్చేసి రూ. 9,990.  ప్రస్తుతం గోల్డ్, బ్లాక్ కలర్ వెరియంట్లలో లభిస్తోంది.

ఒప్పో ఎ71(2018) ఫీచర్లు ఇలా ఉన్నాయి… 
5.2 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే(720×1280 పిక్సెల్స్) 
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఒఎస్
3జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ స్టోరేజి(256జిబి వరకు మెమొరీని విస్తరించుకునే సదుపాయం)
13ఎంపి ఫ్రంట్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా
3000ఎంఎహెచ్ బ్యాటరీ
4జి ఒఎల్‌టిఇ
బ్లుటూత్ 4.0
యుఎస్‌బి పోర్ట్, డ్యూయల్ సిమ్
3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
ఇక మొబైల్‌లో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) బ్యూటీ టెక్నాలజీ వల్ల ఎంతటి చీకటిలోనైనా ఫోటోలు మరింత స్పష్టంగా వస్తాయి.

Comments

comments