Search
Thursday 24 May 2018
  • :
  • :

పాక్ కొత్త అణ్వాయుధాలు!

int

వాషింగ్టన్: స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఆయుధాలు సహా కొత్త తరహా అణాయుధాలను పాకిస్థాన్ తయారు చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ బుధవారం హెచ్చరించింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు శనివారం సుంజ్వాన్ సైనిక శిబిరంపై దాడిచేసి ఆరుగురు జవానులను చంపేసిన కొన్ని రోజులకే అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటెలిజెన్స్‌పై సెనెట్ సెలెక్ట్ కమిటీ నిర్వహించిన ప్రపంచవ్యాప్త ముప్పులు అనే సమావేశంలో ఆయన శాసనకర్తలకు ఈ విషయం చెప్పారు. స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఆయుధాలు, సముద్రత తలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులు సహా కొత్త తరహా అణ్వాయుధాలను పాకిస్థాన్ తయారు చేస్తోందని ఆయన అన్నా రు. దీంతో భారత ఉపఖండం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగొచ్చని అన్నారు. ఉ. కొరి యా తన క్షిపణి పరిజ్ఞానాన్ని అనేక దేశాలకు ఎగుమతి చేస్తోందని కూడా చెప్పారు. ఇప్పటికే అది ఆరో, అత్యంత శక్తివంత అణు పరీక్ష కూడా జరిపిందన్నారు.
పాక్ ఉగ్రదాడులు కొనసాగే ప్రమాదం
పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు గల టెర్రర్ గ్రూపులు భారత దేశం లోపల దాడులు కొనసాగించే ప్రమాదం ఉందని అమెరికా గూఢచారి అధిపతి హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన హెచ్చరిక వెలువడడం గమనార్హం. జాతీయ గూఢచారి శాఖ డైరెక్టర్ డాన్ కోట్స్ చేసిన ఈ హెచ్చరిక పాకిస్థాన్‌లో ఉన్న జైష్ ఎ మొహమ్మద్ టెర్రరిస్టులు జమ్మూలోని సంజువాన్ సైనిక శిబిరంపై దాడి చేసిన కొన్ని రోజులకు వెలువడడం గమనార్హం. గత శనివారం ఈ దాడిలో ఆరుగురు సైనికులు సహా ఏడుగురు మరణించారు.ఫిబ్రవరి 12న భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల పోరాటం ప్రజ్వరిల్లింది. మిలిటెంట్లు శ్రీనగర్‌లోని కరణ్ నగర్ ప్రాంతంలో దాగొని సిఆర్‌పిఎఫ్ శిబిరంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భద్ర తా దళాలు వమ్ము చేశాయి. అణ్వాయుధాల సామర్థాన్ని కొత్తగా వినియోగించుకోవడం ద్వారా అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు పాకిస్థాన్ కొనసాగిస్తున్నట్లు కూడా నిఘా అధికార్లు పేర్కొన్నారు. టెర్రరిజం పై పోరాటాన్ని వమ్ము చేయడానికి పాక్‌ఉగ్ర సంస్థల సంబంధా లు ఉపయోగపడతాయని కూడా కోట్స్ చెప్పారు. చైనాకు దగ్గరగా జరగడం ద్వారా పాకిస్థాన్ అమెరికాకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు కూడాహెచ్చరించారు. నిఘా వ్యవహారాలపై సెనెట్ ఎంపిక సంఘం ముందు ఆయన అలా సాక్షం ఇచ్చారు.

Comments

comments