Search
Thursday 24 May 2018
  • :
  • :

యుజిసి నిబంధనల మేరకే పిహెచ్‌డి ప్రవేశాలు

pg

మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివర్సిటీలలో పిహెచ్‌డి ప్రవేశాలలో న్యాక్ ఎ, న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉన్న వర్సిటీలలో ఒక విధానం, ఈ గుర్తింపులు లేని వర్సిటీల్లో మరో విధానం అమలు కానుంది. న్యాక్ ఎ, ఎ ప్లస్ గుర్తింపు వర్సిటీల్లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యుజిసి) నిబంధనల మేరకు పిహెచ్‌డి ప్రవేశాలు చేపట్టేలా కమిటీ సిఫార్సు చేయనుంది. వర్సిటీలలో పిహెచ్‌డి ప్రవేశాల విధివిధానాల రూపకల్పనకు వివిధ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లతో నియమించిన నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై పిహెచ్‌డి ప్రవేశాల విధివిధినాలు ఖరారు చేయను న్నట్లు తెలిసింది. న్యాక్ ఎ, న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉన్న వర్సిటీలు సొంతంగా పిహెచ్‌డిలో ప్రవేశాలు నిర్వహించనున్నాయి. న్యాక్ గుర్తింపు లేని వర్సిటీలలో పిహెచ్‌డి ప్రవేశాలకు ఎలాంటి విధివిధానాలు రూపొందించాలో కమిటీ కసరత్తు చేస్తోంది. పిహెచ్‌డి ప్రవేశాలకు కొత్తగా విధివిధానాలు రూపొందించడం కన్నా యుజిసి రూపొందించిన నిబంధనలు యథావిధిగా అమలు చేయడం మేలని భావిస్తున్నట్లు తెలిసింది. నెట్, సెట్, జెఆర్‌ఎఫ్ ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణించి ప్రవేశ పరీక్ష లేకుండా పిహెచ్‌డిలో ప్రవేశం కల్పించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
న్యాక్ ఎ ప్లస్ వర్సిటీల్లో సొంతంగా ప్రవేశాలు:న్యాక్ ఎ, న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు కలిగిన యూనివర్సి టీలు కమిటీ సిఫార్సులతో సంబంధం లేకుండా సొంతంగా పిహెచ్‌డి ప్రవేశాలు చేపట్టనున్నాయి. ప్రవేశ పరీక్ష నిర్వహించాలా..? వద్దా..? అనేది ఆయా వర్సిటీలే నిర్ణయించుకోవచ్చు. అయితే న్యాక్ ఎ, ఎ ప్లస్ గుర్తింపు ఉన్న వర్సిటీలు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రవేశ పరీక్ష ఉంటే యుజిసి రూపొందించిన అర్హతలతోపాటు ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే పిహెచ్‌డిలో ప్రవేశాలు కల్పిస్తారు. లేనిపక్షంలో నెట్, సెట్, జెఆర్‌ఎఫ్ వంటి ఎన్ని అర్హతలు ఉన్నా పిహెచ్‌డిలో ప్రవేశం ఇవ్వరు.

Comments

comments