Search
Friday 25 May 2018
  • :
  • :

నోట్ల రద్దు ఆలోచన ఆర్‌ఎస్‌ఎస్‌దే : రాహుల్

RAHUL

బెంగళూరు : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం కర్నాటకలో పర్యటిస్తున్నారు. ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను తన చేతుల్లోకి తీసుకోవాలని బిజెపి చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రతి సంస్థలో తన మనిషిని పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు ఆలోచన ఆర్‌బిఐ, అరుణ్ జైట్లీలది కాదని, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచన మేరకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఆర్థిక శాఖలోని ఓ అధికారి ఈ నోట్ల రద్దు ఆలోచనను ప్రధాని మోడీ మెదడులోకి ఎక్కించారని ఆయన అన్నారు. భారత్ ఆర్మీపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. భగవత్ ఆర్మీని కించపరిచారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Rahul Gandhi Comments on RSS

Comments

comments