Search
Thursday 24 May 2018
  • :
  • :

మార్చి 16 నుండి సెట్స్‌పైకి…

ramp

‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంతో ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో రామ్. ఈ చిత్రం  తర్వాత అతను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. కొత్తదనంతో కూడిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అందాల తార అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుండి మొదలుకానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు ఫిల్మ్‌మేకర్స్. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన సినిమా చూపిస్త మామా, నేను లోకల్ చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆమె ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

Comments

comments