Search
Thursday 24 May 2018
  • :
  • :

ఎంత సక్కగున్నావే

ramchn

రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు సుకుమార్ తనదైన స్టైల్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. అనసూయ ఓ ముఖ్య పాత్రను పోషించింది.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మార్చి 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వైజాగ్‌లో భారీ ఎత్తున చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరుకానున్నారని  సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. దీనికి పది లక్షల వ్యూస్ రావడం విశేషం.  మొదటిసారి పల్లెటూరి మాస్ గెటప్‌లో చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి అతని సోదరుడిగా కనిపించబోతున్నట్టు తెలిసింది. ఇక ఈ చిత్రంలోని  మొదటి పాటను మంగళవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ‘ఎంత సక్కగున్నావే…’ అంటూ మొదలయ్యే ఈ పాటను  రామ్‌చరణ్, సమంతలపై అందంగా చిత్రీకరించారు. సమంతను తలచుకుంటూ చరణ్ పాడే ఈ ప్రేమగీతం  బీట్‌కు సంబంధించిన టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్‌లో పెట్టేశాడు.

Comments

comments