Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

కోలుకున్న సూచీలు

bsns2

తర్జాతీయంగా సానుకూల సంకేతాలు
కొనుగోళ్ల జోష్‌తో 295 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : వరుస నష్టాలతో తీవ్ర ఆందోళనకు గురిచేసిన స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ పుంజుకోవడం, ఆసియా మార్కెట్లు లాభపడంతో సోమవారం దేశీయ సూచీలు సానుకూలంగా ముందుకు సాగాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోష్‌తో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294.09 పాయింట్లు లాభపడి 34,300 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 84.80 పాయింట్లు పెరిగి 10539.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 34,115 నుంచి -34,351 మధ్య శ్రేణిలో కదలాడింది. పియుసి బ్యాంక్, ఐటీ రంగాలకు చెందిన షేర్లు తప్ప, మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లోనే ముగిశాయి. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్ల లాభపడి 25,701 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత వారంలో నష్టాలు భయపెట్టినా వారాంతాన అమెరికా మార్కెట్ల లాభా ల ముగిశాయి. ఈవారం కూడా అదేరీతిలో లాభా లు కొనసాగడం, మరోవైపు ఆసియా మార్కెట్లు సానుకూల ప్రారంభంతో సెంటిమెంట్‌ను బలపడింది. ఉదయం నుంచే సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంతో 34,203.34 వద్ద ట్రేడింగ్ ఆరంభించి ఆఖరికి 295 పాయింట్లు పెరిగింది. భారీ లాభాలతోనే సూచీలు ట్రేడింగ్‌ను ప్రారంభించడం ఇన్వెస్టర్లకు, ట్రేడర్లుకు మరింత ఉత్సాహానిచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావం చూపించిన అంశాలు ఏవీ లేవడంతో సూచీలు రోజంతా స్థిరమైన లాభాల ర్యాలీని చేశాయి. ఓ దశలో సెన్సెక్స్ ఓ దశలో 330 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్, యుపిఎల్, అరబిందో ఫార్మా, టాటాస్టీల్ 3 నుంచి 4 శాతం లాభపడ్డాయి. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎస్‌బిఐ, భారత్ పెట్రోలియం, భారత ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహింద్రా షేర్లు నష్టపోయాయి.

Comments

comments