Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఎట్టకేలకు ఫామ్‌లోకి రోహిత్.. సెంచరీ నమోదు

Rohit

పోర్ట్ ఎలిజబెత్: వేదికగా సెయింట్ జార్జ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతకం నమోదు చేశాడు. 107 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఇది రోహిత్‌కు వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీ కాగా, సఫారీలపై రెండోది. మొదటి నాల్గు వన్డేల్లో ఘోరంగా విఫలమైన రోహిత్ ఈ వన్డేలో ఫామ్‌లోకి రావడం విశేషం. అంతకు ముందు కోహ్లి-రోహిత్ జోడి వన్డేల్లో 13వ సారి శతక భాగస్వామ్యాన్ని(105) నమోదు చేశారు. కాసేపటికే అనవసర పరుగు కోసం యత్నించి కోహ్లీ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి-రోహిత్ జోడి ఇలా రనౌట్ కావడం ఇది ఏడోసారి. ఇందులో కోహ్లినే ఐదుసార్లు రనౌట్ కావడం గమనార్హం. ప్రస్తుతం క్రీజులో రోహిత్(), అయ్యర్() ఉండగా… భారత్ స్కోర్: 220/3(40 ఓవర్లు).

Comments

comments